తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-

ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ .వి .హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్., ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు మరియు పోలీస్ అధికారులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం”(PGRS) కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాలనుండి వచ్చిన ఫిర్యాదులను పోలీస్ అధికారులు స్వీకరించి వారితో మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి సవివరంగా అడిగి తెలుసుకున్నారు. అందిన ప్రతి పిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వర పరిష్కారం కల్పిస్తామని బాధితులకు భరోసా కల్పించారు. అదేవిధంగా అందిన ఫిర్యాదుల వివరాలను సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ వివాదాలు, ఉద్యోగ మోసాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు మరియు ఇతర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రజల విశ్వాసం పెంపొందించడమే కాకుండా బాధితులకు తక్షణ సహాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పొదిలి సీఐ రాజేష్ కుమార్, గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, వైపాలెం సీఐ కె అజయ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *