ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు 58 ఫిర్యాదులు
తొలి శుభోదయం ప్రకాశం:-
ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్. ఆధ్వర్యంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి వివి రమణ కుమార్ మరియు పోలీస్ అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పోలీస్ అధికారులు ఫిర్యాదిదారులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగ సంబంధిత / ఆన్లైన్ మోసాలు, భూ వివాదాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ఫిర్యాదిదారులు స్వేచ్ఛగా విన్నవించారు. ఫిర్యాదిదారుల సమస్యలను సవివరంగా విని, సానుకూలంగా స్పందించిన అధికారులు చట్టపరమైన విధానాల ద్వారా త్వరితగతిన న్యాయం అందిస్తామని భరోసా కల్పించారు.సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులతో మాట్లాడించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మీకోసం కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును సత్వరంగా పరిష్కరించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి వివి రమణ కుమార్, ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ, కందుకూరు సిఐ షైక్ అన్వర్ బాషా, పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, దర్శి సీఐ వై.రామారావు, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
