తొలి శుభోదయం ప్రకాశం:-

రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపిఎస్.ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులు 534.7 కిలోమీటర్ల దూరం వరకు కొనసాగుతుంది.ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్ ఎక్కువ గా జరగడం తో వాటిని నివారించేందుకు జిల్లా ఎస్పీ ప్రత్యేకించి కొత్తగా రోడ్డు సేఫ్టీ వారియర్స్ టీంలను ఎర్పాటు చేయడం జరిగిందిఎస్పీ ఆదేశాల మేరకు ఈ టీమ్‌లను ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎర్పాటు చేశారు.
ఈ టీంలో సభ్యులు గా పోలీస్ సిబ్బంది, నేషనల్ హైవే సిబ్బంది, నేషనల్ హైవే కు అనుకుని ఉన్న గ్రామస్థులతోపాటు వివిధ రకాలుగా సమాజ సేవ చేస్తున్న సోషల్ వర్కర్లు, మొదలగువారి ఉంటారు. ఈ టీం సభ్యులు ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
మొదటగా 534.7 కిలోమీటర్ల రహదారిలో ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్లను గుర్తించడం జరుగుతుంది. ప్రమాదాలు ఎక్కువగా ఉదయం, సాయంత్రం,రాత్రి ఏ సమయాల్లో జరుగుతున్నాయో కూడా విశ్లేషిస్తారు.ఇటీవలి కాలంలో గ్రామాల నుండి నేషనల్ హైవేకు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో, అటు–ఇటు చూడకుండా వేగంగా వస్తున్న ద్విచక్రవాహనాలు, కార్లు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.ఈ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రయాణికులు వెళ్లే దృష్ట్యా, ఎస్పీ గారు ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ వారియర్స్ టీమ్‌లు అక్కడ వాహనాల వేగాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటున్నారు. దీని ద్వారా గణనీయంగా ప్రమాదాలను తగ్గించవచ్చు.బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి అక్కడ స్ధానిక పోలీస్ స్టేషను నుండి సిబ్బంది తోపాటు బ్యారిగేట్లు ఎర్పాటు చేయడం జరుగుతుంది.జాతీయ రహదారి పై వెళ్ళుతున్న వాహన చోదకులు.. వాహనాల లైటింగ్ ను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి.లారీలు, బస్సులు యజమానులు వాహనం వెనుకభాగం లో ఎట్టిపరిస్ధతులలో రేడియం స్ట్కిక్లు అతికించుకొవాలి.
శీతాకాలంలో పొగమంచు అధికంగా ఉండటం వల్ల…లారీ, బస్సులు, కారు, ద్విచక్ర వాహన చోదకులు వాహనాన్ని రోడ్డు పక్కన ఖాళీగా ఉన్న స్థలాలలో మాత్రమే పార్కింగ్ చేయాలి.జాతీయ, రాష్ట్ర రహదారుల అంచున వాహనాలు నిలిపివేయడం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. అందువల్ల నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలను నిలిపివేయాలని సూచిస్తున్నారు.
పోలీసు నిబంధనలు ఉల్లంఘించే వారిపై మోటార్ వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు.ప్రజలంతా కలిసికట్టుగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలను సులభంగా నివారించవచ్చని ప్రకాశం జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *