తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా పోలీస్ విభాగం నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా Visible Policing విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పుతోంది.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ రోడ్లపై స్పష్టంగా కనిపించే విధంగా విధులు నిర్వహిస్తూ నేర నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు ప్రజల భద్రతపై విశ్వాసం పెంచేలా చర్యలు చేపడుతున్నారు.Visible Policing ద్వారా చైన్ స్నాచింగ్‌లు, గలాటాలు, అనుమానాస్పద కదలికలు వంటి నేరాలకు ముందస్తు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతోంది. పోలీస్ సిబ్బంది ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా మైదానంలో నిరంతరం కనిపిస్తూ, నేరాలను ప్రారంభ దశలోనే గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.ఈ విధానంతో ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం మరింత బలపడడంతో పాటు, జిల్లాలో శాంతి భద్రతలు పటిష్టంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. నేర రహిత సమాజం లక్ష్యంగా ఈ Visible Policing విధానాన్ని మరింత విస్తృతంగా కొనసాగించనున్నట్లు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *