తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :-
రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సీఎంఆర్ ఎఫ్ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తూ పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం తూర్పునాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో 47 మంది లబ్ధిదారులకు రూ. 55 లక్షల విలువైన సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులని మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం.ఆర్.ఎఫ్ ద్వారా కొండపి నియోజకవర్గంలో ఇప్పటివరకు 1687 మందికి రూ.13 కోట్ల 51 లక్షల 46 వేలు పంపిణీ చేసినట్టు మంత్రి తెలిపారు. పేదల ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని అందుకోసం తమ ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తుందన్నారు. చేనేతల మగ్గాలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్ కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు కార్యక్రమానికి నేడు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టి చేనేతల కుటుంబాల్లో ఆనందాలు తీసుకొచ్చారన్నారు. చెప్పిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామని, ప్రజా సంక్షేమం,రాష్ట్ర అభివృద్ధిలో తమ ప్రభుత్వం ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. రాజదాని అమరావతి చట్టబద్ధత బిల్లుకి నేడు లోక్ సభ ఆమోదం తెలపడం పట్ల ఈ సందర్భంగా మంత్రి హర్షం వ్యక్తం చేశారు. దీనికి సహకరించిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడుకి, పార్లమెంట్ లో మద్దతు తెలిపిన ప్రతి రాజకీయ పార్టీకి మంత్రి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
