తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మరియు పోలీస్ అధికారులు “ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం)” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి లిఖితపూర్వక అర్జీలతో వారి సమస్యలను ధైర్యంగా జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులకు విన్నవించారు. పోలీసులు ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి, వారి ఫిర్యాదుల పూర్వాపరాలను తెలుసుకుని, వాటిని చట్టపరంగా త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.అందిన ఆయా ఫిర్యాదులపై ఎస్పీ గారు సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఆ ఫిర్యాదులపై తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోని భాధితులకు న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు. మీకోసం ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో ఫిర్యాదులు పరిష్కారించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.ఫిర్యాదు చేయడానికి వచ్చే వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్నవారి సమస్యలను విని, వారికి సత్వర న్యాయం కల్పించాలని, సంఘటన ప్రదేశాన్ని సందర్శించాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎక్కువగా సివిల్/భూ/ఆర్థిక తగాదాలు, అత్తరింటి వేదింపులు, ఉద్యోగ మోసాలు మరియు పలు ఫిర్యాదులు ఉన్నాయి.ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ వి.వి. రమణకుమార్, పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, సింగరాయకొండ సీఐ CH.హాజరత్తయ్య, దర్శి సీఐ వై.రామారావు, మార్కాపురం సీఐ సుబ్బారావు, కొండెపి సీఐ సోమశేఖర్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *