తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రాంతాలపై (Open Drinking Spots) పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా, పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం బాటిళ్లు, ప్లాస్టిక్ వ్యర్థాలతో అపరిశుభ్రంగా మారిన శివారు ప్రాంతాలను, ఖాళీ స్థలాలను పోలీస్ సిబ్బంది స్వయంగా శుభ్రం చేశారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రాంతాలు నేరాలకు నిలయాలుగా మారకుండా ఉండేందుకు, సామాజిక బాధ్యతగా ఈ శుభ్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. బహిరంగ మద్యపానం వల్ల మహిళలు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *