తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-

ప్రజా శాంతిభద్రతలు, సామాజిక క్రమశిక్షణ పరిరక్షణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా బహిరంగ మద్యపానం (ఓపెన్ బూజింగ్)ను నియంత్రించేందుకు ప్రత్యేక శుభ్రత–అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో బహిరంగంగా మద్యపానం జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేశారు. అలాగే స్థానిక ప్రజలకు బహిరంగ మద్యపానం వల్ల కలిగే సామాజిక దుష్పరిణామాలు, కుటుంబ వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావాలపై అవగాహన కల్పించారు.బహిరంగ మద్యపానం వల్ల నేరాలు, ఘర్షణలు, రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.గ్రామాలు, కాలనీల్లో శాంతియుత వాతావరణం కొనసాగాలంటే ప్రజల సహకారం అత్యవసరమని, బహిరంగ మద్యపానం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రజల భద్రత, పరిశుభ్రత లక్ష్యంగా ఓపెన్ బూజింగ్ నియంత్రణకు సంబంధించి ఇలాంటి శుభ్రత–అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *