తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-

పట్టణానికి చెందిన 37 మంది అర్చకులు సత్కారం స్వీకరించారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షుడు బోయినపల్లి బాల శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమం, అభివృద్ధి, ఐక్యత లక్ష్యంగా ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటైన తమ సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహించిందని, ముఖ్యంగా తాము అందిస్తున్న గుర్తింపు కార్డు ద్వారా అనేక రాయితీలతో కూడిన విద్యా, వైద్య సదుపాయాలు పొందవచ్చునని వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ కార్డు చెల్లుబాటు అవుతుందని బ్రాహ్మణ బంధువులు ఈ అవకాశం వినియోగించు కోవాలని కోరారు. బ్రాహ్మణులను ఎవరు ఏ రకంగా అవమానించినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కార్యక్రమానికి వేదిక సంయుక్త కార్యదర్శి సిఎస్ఆర్ ఆంజనేయులు అధ్యక్షత వహించగా, సీనియర్ జర్నలిస్ట్ మతుకుమల్లి మనోహర్, వేదిక బాపట్ల విభాగం కన్వీనర్ శ్రీమతి వెంకటరమణ, భావపురి బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు నిభానుపూడి శ్రీహరి ప్రకాష్, బ్రాహ్మణ కార్పోరేషన్ డైరెక్టర్ చివుకుల దుర్గా ప్రసాద్, కుందుర్తి పిచ్చయ్య శాస్త్రి, పద్మవల్లి, లోక భ్రమర పలువురు అర్చకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *