తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

​ ఒంగోలులోని అంబేద్కర్ భవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబూ జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో
​MRPS వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. భారత దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా అణగారిన వర్గాల ఉన్నతి కోసం బాబూ జగజీవన్ రామ్ గారు చేసిన సాటిలేని సేవలను ఆయన కొనియాడారు. దేశ రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా మరియు ఉపప్రధానిగా బాబుజీ చూపిన పటిమ అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *