తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా కందుకూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించబడినది. ఈ కార్యక్రమమునకు బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ద్వారకా రాణి అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో న్యాయవాదులు పోకూరి కోటయ్య, పండిట్ సంపత్, ముప్పవరకు కిషోర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ బాలల హక్కులు గురించి, భారత రాజ్యాంగంలో బాల బాలికలకు పొందుపరిచిన చట్టాలపై అవగాహన కల్పించారు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు. న్యాయవాది సంపత్ కుమార్ మౌనంగానే ఎదగమని పాడిన పాట పిల్లల్లో ఉత్సాహాన్ని నింపింది.