తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-

ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ, రాత్రివేళల్లో నేరాల నివారణే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు, జిల్లా వ్యాప్తంగా అప్రమత్తంగా నైట్ బీట్ డ్యూటీలు నిర్వహిస్తోంది. రాత్రి సమయాల్లో పట్టణాలు, గ్రామాలు, ప్రధాన రహదారులు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తూ ముందస్తు చర్యలు చేపడుతున్నారు.నైట్ బీట్‌లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ, నేరాలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపై నిరంతర గస్తీతో పాటు, బహిరంగ ప్రదేశాలు, కాలనీలు, వాణిజ్య ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేశారు.పోలీస్ అధికారులు మాట్లాడుతూ… రాత్రివేళల్లో ప్రజలు నిశ్చింతగా విశ్రాంతి తీసుకునేలా భద్రత కల్పించడమే నైట్ బీట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112 ద్వారా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ప్రకాశం జిల్లా వ్యాప్తంగా నేరాలను నియంత్రించేందుకు, ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయేందుకు ఇలాంటి నైట్ బీట్, విజిబుల్ పోలిసింగ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని జిల్లా పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *