తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-

భక్తుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు స్కై ఐ – డ్రోన్ ప్రాజెక్ట్ సహాయంతో బ్రహ్మంగారి తిరునాళ్ల బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించారు.కనిగిరి మండలం తాళ్లూరు గ్రామంలో నిర్వహించిన ఈ తిరునాళ్ల సందర్భంగా డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టి, గుంపుల కదలికలు, ట్రాఫిక్ నియంత్రణ, అనుమానాస్పద పరిస్థితులపై ముందస్తు అప్రమత్తత పాటించారు. దీనివల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, తిరునాళ్లు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయి.ఈ బందోబస్తు కార్యక్రమాన్ని హెచ్‌.ఎం‌.పాడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించగా, పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించారు. భక్తులు పోలీసులకు సహకరించడంతో భద్రతా ఏర్పాట్లు మరింత సాఫీగా సాగాయని అధికారులు తెలిపారు.భవిష్యత్తులో కూడా ప్రజా రద్దీ ఎక్కువగా ఉండే పండుగలు, వేడుకల సమయంలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ భద్రతను మరింత బలోపేతం చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *