తొలి శుభోదయం ప్రకాశం:-

భక్త కనకదాసు జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. మరియు పోలీస్ అధికారులు మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, భక్త కనకదాసు గారు 1509 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో జన్మించి, విశిష్టమైన కవిగా, తత్వవేత్తగా, సామాజిక సంస్కర్తగా గుర్తింపు పొందారని తెలిపారు. తన రచనలు, కీర్తనల ద్వారా సమాజంలోని కుల అసమానతలను రూపుమాపేందుకు కనకదాసు గారు చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఆయన రచనలు ప్రజల్లో భక్తి, మానవత, సమానత్వం, న్యాయం, సత్యం వంటి విలువలను బోధించాయని పేర్కొన్నారు. ఆయన సాహిత్యంతో సామాజిక విప్లవాన్ని తెచ్చిన మహాకవి అని కొనియాడారు.
భక్త కనకదాసు గారి బోధనలు నేటికీ సార్థకమని, ఆయన సందేశం సమానత్వం, దయ, సత్యం, సేవ వంటి విలువలు సమాజ అభివృద్ధికి పునాదిగా నిలుస్తాయని అన్నారు. భక్తి మార్గం మనకు ధర్మం, కర్తవ్య నిబద్ధత, మానవత పట్ల అంకితభావం నేర్పుతుందని పేర్కొన్నారు.భక్త కనకదాసు గారి ఆలోచనలు ఈ విలువలకు ప్రేరణనిస్తాయని, ఆయన సందేశాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. మానవతా విలువలను ప్రతిపాదించిన మహనీయుల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. పోలీసు సిబ్బంది కూడా భక్త కనకదాసు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గప్రసాద్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ యు.సుధాకర్, CCS ఇన్స్పెక్టర్ జగదీష్, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *