తొలి శుభోదయం సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పోరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…దేవునికి ఎవరు పాలకులు కాదు, మనం ధర్మకర్తలం మాత్రమే. స్వామి వారి ఉత్సవాలు, కైంకర్యాలు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించాలి.భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పనకు నూతన ఆలయ అభివృద్ధికి ధర్మకర్తల మండలి కృషి చేయాలి.వైసీపీ హయాంలో కాసుల కక్కుర్తి తో తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు.నెయ్యిలో కల్తీ జరిగిందని స్వయంగా నాటి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఒప్పుకున్నారు. అని పేర్కొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *