తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
‘జల ధార – జల హారతి’ కార్యక్రమం అనంతరం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు పాల్గొన్నారు.జిల్లాలో భూగర్భ నీటిమట్టం పెంపు, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, నీటి వనరుల సమర్థ నిర్వహణకు చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. మొంథా తుఫాను సమయంలో నిండిన చెరువుల నీటిని సమీప జల వనరులకు మళ్లించేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేసినట్లు తెలిపారు.జిల్లా పరిస్థితులకు అనుగుణంగా ‘ జల సురక్ష మిషన్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి, భూగర్భ నీటి నిల్వలో గణనీయ పురోగతి సాధించే దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.
జిల్లాను సస్యశ్యామలం చేయడం లక్ష్యంగా సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.