తొలి శుభోదయం కొడపి:-
ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో మర్రిపూడి మండలంలో కూచిపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటుగా జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ గారు కూడా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు పంపిణీ చేశారు.