సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన పార్టీలు,సంఘాలు.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
షెడ్యూల్ కులాలు (SC) క్రైస్తవ మతంలోనికి మారితే కులం హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రాజ్యాంగ సమీక్ష కమిటీ పున: పరిశీలన చేసి దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగినది.భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ షెడ్యూల్ కులాల ప్రజలు క్రిస్టియన్ మతం లోనికి మారితే భారత రాజ్యాంగం వారికి కల్పించిన రక్షణ చట్టాలు కోల్పోతారని తీర్పు వెలువరించియున్నది. ఇది భారత లౌకిక రాజ్యాంగ స్ఫూర్తి కి భిన్నమైనదిగా భావిస్తూ దళితులు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ప్రజలు క్రైస్తవ్యం తీసుకోవడం వలన సమాజములో వారు కులపరంగా ఎదుర్కొను వివక్షత అంటరానితనం అవమానాలు ఏమి రూపు మారటం లేదని అందుకే షెడ్యూల్ కులాల ప్రజలకు క్రైస్తవంలో మారినప్పటికీ కూడా రాజ్యాంగం ఆర్టికల్ 15 లో కల్పించిన విధంగా రక్షణ చట్టాలను అమలు చేయాలని కోరారు. అదేవిధంగా భారత పౌరులు వారికి నచ్చిన మతం స్వీకరించే విధంగా ఆర్టికల్ 25 ప్రతిపాదించిన మత స్వేచ్ఛను గౌరవించాలని కోరుతున్నాము అని అన్నారు . ఈ విషయమును రాజ్యాంగ బెంచ్ కూడా తెలియచేసి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల ప్రజల పట్ల వారి హక్కులను కాపాడే విధంగా చర్యలు తీసుకొనగలరని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అండ్ యాంటీ క్రైమ్ జాతీయ సలహాదారులు ముప్పవరపు. కిషోర్, భారత కమ్యూనిస్టు పార్టీ కందుకూరు నియోజకవర్గం కార్యదర్శి భూసి సురేష్ బాబు, సిపిఎం పట్టణ కార్యదర్శి షేక్ గౌస్ బాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతరబోయిన నరేష్, ఒలేటి వారి పాలెం మండల పాస్టర్ ఫెలోషిప్ సలహాదారులు వై.దేవ కుమార్, అధ్యక్షులు దువ్వూరి యాకోబు, పాస్టర్స్ గౌడపేరు.సుబ్బారావు, గల్లా జయరావు,కొమ్ము బాబురావు లింగా బత్తిన ధామస్, కొప్పర్తి జాషువా, సిపిఐ నాయకులు బొల్లోజుల బాల బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.