తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి పట్టణంలోని మోడల్ స్కూల్‌లో ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్తు పదార్థాల నివారణ (Anti-Drugs), గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, శక్తి యాప్ వినియోగం, అలాగే సైబర్ భద్రత అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాన్ని వెలిగండ్ల పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారు నిర్వహించి, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు, బాలల భద్రతకు సంబంధించిన గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అవగాహన, అత్యవసర పరిస్థితుల్లో మహిళల రక్షణ కోసం రూపొందించిన శక్తి యాప్ ఉపయోగించే విధానం గురించి వివరించారు.అదేవిధంగా, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాల నుంచి ఎలా రక్షించుకోవాలనే విషయాలపై కూడా విద్యార్థులకు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించి, సురక్షితమైన భవిష్యత్తు కోసం సరైన నిర్ణయాలు తీసుకునేలా మార్గనిర్దేశం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *