తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు అక్రమ జూద కార్యకలాపాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రోత్ సెంటర్ ప్రాంతంలో ప్రత్యేక జూద దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న 5 మంది వ్యక్తులను పట్టుకుని, వారి వద్ద నుండి రూ.25,960/- నగదును స్వాధీనం చేసుకున్నారు.అక్రమ జూదం సామాజిక శాంతికి భంగం కలిగించడమే కాకుండా నేరాలకు దారితీస్తుందని పోలీసులు తెలిపారు. ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేస్తూ, భవిష్యత్తులో కూడా జూదం, గ్యాంబ్లింగ్ వంటి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.ప్రజలు తమ పరిసరాల్లో జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు–పోలీసుల సహకారంతోనే నేరరహిత, సురక్షితమైన ప్రకాశం జిల్లా సాధ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *