తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
మహాత్మా జ్యోతిరావు పూలే గారి ద్విశతాబ్ది జయంతి సందర్భంగా దర్శి టిడిపి కార్యాలయంలో Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డా. కడియాల లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతి, కులవ్యవస్థ నిర్మూలన, విద్య ప్రాధాన్యత కోసం పూలే గారి సేవలు అపారమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను అందరం ఆచరించాలని పిలుపునిచ్చారు.