తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-

మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీస్ సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీస్ మరియు మార్కాపురం జిల్లా పోలీస్ శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా శక్తి యాప్ (Shakthi App) డౌన్‌లోడ్ మరియు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమాలలో భాగంగా ఒంగోలు హెడ్‌క్వార్టర్స్ టీమ్–II ద్వారా పెద్ద సంఖ్యలో శక్తి యాప్‌లు డౌన్‌లోడ్ చేయించగా, ఒంగోలు ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో హెడ్‌క్వార్టర్స్ టీమ్–I ఆధ్వర్యంలో శక్తి యాప్ డౌన్‌లోడ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.అలాగే మార్కాపురం ఆర్టీసీ బస్‌స్టాండ్ సెంటర్‌లో శక్తి టీమ్ ఆధ్వర్యంలో, దర్శి ఎస్‌డీ శక్తి టీమ్ ద్వారా, మహిళలు, యువత, ప్రయాణికులకు శక్తి యాప్ ఉపయోగాలు, డౌన్‌లోడ్ విధానం, అత్యవసర సమయంలో యాప్ ద్వారా పోలీస్ సహాయం ఎలా పొందాలో వివరించారు.ఇంకా కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శక్తి SOS ఇన్‌స్టాలేషన్‌తో పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించి, మహిళలు ఏ ప్రమాదంలో ఉన్నా ఒక్క క్లిక్‌తో పోలీస్ సహాయం పొందవచ్చని తెలియజేశారు.శక్తి యాప్ ద్వారా మహిళల లొకేషన్ ట్రాకింగ్, అత్యవసర అలర్ట్స్, తక్షణ స్పందన వంటి భద్రతా సదుపాయాలు అందుబాటులో ఉంటాయని పోలీసులు వివరించారు. మహిళలు భయపడకుండా ధైర్యంగా ముందుకు రావాలని, పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా, శక్తి యాప్ ప్రచారం, డౌన్‌లోడ్లు, అవగాహన కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీస్ మరియు మార్కాపురం జిల్లా పోలీస్ శాఖలు స్పష్టం చేశాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *