నూతన మార్కాపురం జిల్లా ఇంచార్జ్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు, ఐపియస్.

తొలి శుభోదయం మార్కాపురం:-

నూతన మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో బుధవారం మార్కాపురం డి.ఎస్.పి కార్యాలయం లో ఏర్పాటు చేసిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఇన్చార్జి ఎస్పి శ్రీవి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి తో కలిసి గౌరవ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గారు బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, ఐఏఎస్. మారీ టైం బోర్డు దామచర్ల శ్రీ సత్య , మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి , కనిగిరి ఎమ్మెల్యే శ్రీ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి గారు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు , మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నూతనంగా మార్కాపురం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై నిరంతర నిఘా, గంజాయి–డ్రగ్స్ పూర్తిస్థాయి నిర్మూలన, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. మహిళలు మరియు చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.నూతన జిల్లాకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లా అభివృద్ధి మరియు ప్రజల భద్రత కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కార చర్యలు చేపడతామన్నారు.మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి బాధితుడికి తక్షణ న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే గుట్కా, గంజాయి, నాటు సారా వంటి అసాంఘిక కార్యకలాపాలను సమూలంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని తెలిపారు.అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం పరిసర ప్రాంతాలు, పాత బిల్డింగ్, పాత పోలీస్ క్వార్టర్స్‌లను పరిశీలించి, పోలీస్ పరిపాలన కార్యాలయాలకు ఉపయోగపడేలా యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి మార్కాపురం పట్టణంలోని పట్టు పరిశ్రమ శాఖ, ఎస్‌వీకేపీ కళాశాల పరిసరాలను కూడా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు, ఎస్బీ డీఎస్పీ చిరంజీవి, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బీ ఇన్‌స్పెక్టర్ దేవప్రభాకర్, మార్కాపురం సీఐ సుబ్బారావు, త్రిపురాంతకం సీఐ అసన్, కనిగిరి సీఐ శ్రీనివాసులు, వైపాలెం సీఐ అజయ్ కుమార్, పామూరు సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *