తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,మార్కాపురం సీఐ పర్యవేక్షణలో, మార్కాపురం రూరల్ ఎస్సై డాగ్ స్క్వాడ్‌తో కలిసి పట్టణంలోని RTC బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎస్టేట్ కాలనీ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజాభద్రత, నేరాల నివారణ, అనుమానాస్పద వస్తువులు మరియు వ్యక్తులను గుర్తించేందుకు ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారని అధికారులు తెలిపారు. పట్టణంలో నిశ్శబ్ద భద్రతా వాతావరణాన్ని కొనసాగించేందుకు ఇలాంటి తనిఖీలు తరచుగా జరుగుతాయని పేర్కొన్నారు.