తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసుల బృందం మార్రిపూడి మండలం పరిధిలోని గర్లపేట గ్రామంలో జూదం నిర్వహిస్తున్న వారిపై దాడి నిర్వహించింది.ఈ దాడిలో 6 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.4,820 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదం వంటి అక్రమ కార్యకలాపాలు సమాజానికి హానికరమని, ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు.ఈ కేసుకు సంబంధించి మార్రిపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు మార్రిపూడి ఎస్‌ఐ తెలిపారు.ప్రజలు అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ప్రకాశం జిల్లా పోలీసులు కోరారు.