తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ముండ్లమూరు మండలం మరెల్ల గ్రామంలో ప్రకాశం జిల్లా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మరియు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరించి, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణనష్టం తగ్గుతుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.
ప్రజలు బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, తమ కుటుంబాల భద్రత కోసమే ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.