తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
శుక్రవారం దర్శి లోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) మరియు LOC ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ అందజేశారు.
CMRF ద్వారా 9 మందికి ₹4,85,072
LOC ద్వారా 7 మందికి ₹7,45,607
మొత్తం: ₹12,30,679
ఈ కార్యక్రమంలో:
దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య,AMC చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు,
మండల పార్టీ అధ్యక్షులు మరెళ్ల వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ,
వార్డ్ కౌన్సిలర్ కనకం శ్రీనివాసరావు,వార్డు అధ్యక్షులు, యూనిట్ & బూత్ ఇన్చార్జీలు తదితరులు పాల్గొన్నారు.