తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలులో జాయింట్ కలెక్టర్ కల్పన కుమారిని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మర్యాదపూర్వకంగా కలిసి దర్శి నియోజకవర్గంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సుమారు 20 వేల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రం లేక రైతులు నష్టపోతున్నారని, వెంటనే వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే పౌరసరఫరాల్లో అదనపు ఎంఎల్ఎస్ స్టాక్ పాయింట్‌ను దర్శిలో ఏర్పాటు చేయాలని, రెవెన్యూ కార్యాలయాల్లో సిబ్బంది కొరతను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించాలని కోరగా జేసీ సానుకూలంగా స్పందించారు.
జిల్లా ఎస్పీతో డాక్టర్ లక్ష్మీ సమావేశం
జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజును డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కలిసి దర్శి నియోజకవర్గంలోని శాంతిభద్రతలపై చర్చించారు. పోలీస్ సిబ్బంది సేవలను అభినందిస్తూ, సిబ్బంది కొరతను తీర్చాలని కోరారు.అదనంగా రాజకీయ కేసుల తొలగింపు, దర్శి రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు అవసరాన్ని వివరించారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూడా తెలియజేసినట్లు తెలిపారు.