తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
యుటిఎఫ్ సింగరాయకొండ మండల శాఖ ఆధ్వర్యంలో సింగరాయకొండ మండలంలోని బాలయోగి నగర్ మోడల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే వెంకయ్య ఆధ్వర్యంలో స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ హై హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామానికి ఒక మోడల్ ప్రాథమిక పాఠశాలను మంజూరు చేయడం జరిగిందని ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించడం జరిగిందని ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా మధ్యాహ్నం భోజనం పౌష్టికరమైన ఆహారాన్ని ప్రతిరోజు కోడిగుడ్డును, రోజు మార్చి రోజు రాగి జావా, చిక్కిలను ఇవ్వడం జరుగుతుందని తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే విద్యార్థిని తల్లి అకౌంట్ కు 15 వేల రూపాయలు జమ చేయబడుతుందని అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా మూడు జతల యూనిఫాం ఒక జత బూట్లు రెండు జతల సాక్షులు బ్యాగు, బెల్టు పాఠ్యపుస్తకాలు వర్క్ బుక్కులు ఉచితంగా అందించబడును అదేవిధంగా ప్రతి పాఠశాలలో 200 రకాల పుస్తకాలు విద్యార్థిని విద్యార్థులకు లైబ్రరీ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగినది అదేవిధంగా విద్యార్థులకు నైతిక విలువలు క్రమశిక్షణ అంశాలు నేర్పించబడును విద్యార్థులు ప్రగతిని ప్రతినెల హోలీస్స్టిక్ ప్రోగ్రెస్ కార్డు ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయబడుతుంది ప్రతి నెల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించబడును అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు ప్రతినెల ఆరోగ్య కార్యకర్తల ద్వారా మరియు డాక్టర్ ద్వారా ఉచితంగా వైద్యం సలహాలు మరియు చెకప్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడును అదేవిధంగా పరిశుభ్రమైన టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు తమ ఐదు సంవత్సరాలు నిండిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఊరి బడిన కాపాడుకోవాలని కోరినారు పై కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ శ్రీనివాసరావు జె ప్రభాకర్ రావు, నరేంద్ర కుమార్, రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటపాటి నారాయణ,ఆనాల హిమబిందు, మారుతి దేవి, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ బి మహేష్, పూర్వ విద్యార్థులు మరియు గ్రామస్తులు ఎస్ఎంసి సభ్యులు మొదలగు వారు పాల్గొన్నారు