తొలి శుభోదయం కందుకూరు:-
యువనేత, మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పడమటి బలిజపాలెం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.నా గెలుపులో యువత పాత్ర ఎంతో కీలకం. వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడటం నా బాధ్యత. కందుకూరు యువత ఎప్పటి నుండో కోరుతున్నట్లుగా.. వచ్చే ఏడాది జనవరి 23 నాటికి లోకేష్ బాబు గారి తదుపరి పుట్టినరోజు కల్లా కందుకూరులో శాశ్వత క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను.పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన ‘ఛాంపియన్స్ లెవెన్’, రన్నరప్‌గా నిలిచిన ‘విన్నర్స్ క్లబ్’ జట్లకు, మరియు పాల్గొన్న క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ టోర్నమెంట్‌ను ఇంత ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు.