తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-

సమాజ క్షేమం కోరుతూ భక్తులు సుభిక్షంగా ఉండాలని శుక్రవారం శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో యోగానంద లక్ష్మి నారసింహ స్వామి వారి కి విశేషంగా అష్టోత్తర కలశ స్నపన ( 108 కలశములతో అభిషేకం) ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు దంపతులు నిర్వహించారు. యోగానంద లక్ష్మి నారసింహ క్షేత్రం లో స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమ విశేష పూజలు సాంప్రదాయ పద్ధతిలో అర్చక,ఋత్విక్కుల ముఖంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ధర్మకర్తల మండలి సభ్యులు,ఉభయదాతలు, భక్తులు భక్తి శ్రద్ధల తో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారు. ఇదే విధంగా విశేష దినములలో స్వామి వారికి జరిగే పూజలలో భక్తులు విరివిగా పాల్గొని తరించాలని ధర్మ కర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు భక్తులకు పిలుపు ఇచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *