తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం రాత్రివేళల్లో విస్తృత స్థాయిలో ‘నైట్ బీట్’ పహారాను అమలు చేస్తోంది. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, పట్టణాలు, గ్రామాలు మరియు జాతీయ రహదారులపై నిరంతర గస్తీ నిర్వహిస్తున్నారు.రాత్రి సమయాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వారి వివరాలను క్రైమ్ రికార్డులతో సరిపోల్చుతున్నారు. ముఖ్యంగా బ్యాంకులు, ఏటీఎంలు, మూసివేసిన ఇళ్లు, వ్యాపార కేంద్రాలు వంటి సున్నిత ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత పెంచి, దొంగతనాలు మరియు ఇతర నేరాలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తున్నారు.బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలు సైరన్‌లతో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంచుతున్నాయి. “ప్రజల భద్రతే మా బాధ్యత” అనే లక్ష్యంతో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు.ప్రజలు తమ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా 112 కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న ఈ నిరంతర పహారా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *