తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కనిగిరి డీఎస్పీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్ గారు కనిగిరి హెలిప్యాడ్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా హెలిప్యాడ్ పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు, బ్యారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకల సమన్వయం వంటి అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు.
డీఎస్పీ మాట్లాడుతూ —
“ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎటువంటి లోపాలు లేకుండా భద్రతా ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ప్రజల సౌకర్యం, భద్రత దృష్ట్యా ప్రతి అంశంపై జాగ్రత్తలు తీసుకోవాలి” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.