తొలి శుభోదయం ప్రకాశం:-

మార్కాపురం జిల్లా ఇంచార్జి ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు కనిగిరి సబ్ డివిజన్ పరిధిలో ట్రాఫిక్ నియమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా మైనర్ వయస్సులో వాహనాలు నడుపుతున్న 17 మందిని గుర్తించి, అలాగే హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 105 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వాహన యజమానులపై చట్టప్రకారం జరిమానాలు విధించి, తదుపరి వాహనాలను విడుదల చేయడం జరిగింది. మైనర్ డ్రైవర్ల తల్లిదండ్రులను పిలిపించి, కనిగిరి డిఎస్పీ శ్రీ సాయి ఈశ్వర్ యశ్వంత్ గారు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మైనర్ వయస్సులో వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం, అలాగే చట్టపరంగా ఎదురయ్యే తీవ్ర పరిణామాలపై అవగాహన కల్పించారు.అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారితో భవిష్యత్తులో తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇటువంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని, మైనర్ డ్రైవింగ్ మరియు ట్రాఫిక్ ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలందరూ తమ భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను పాటించి, పోలీసులకు సహకరించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *