తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్న మలుపులు, జంక్షన్లు, బ్లైండ్ స్పాట్స్ వద్ద కన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేశారు.ఈ మిర్రర్లు వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలను ముందుగానే గమనించే అవకాశం కల్పిస్తూ, ప్రమాదాలను నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో మరియు విజిబిలిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఏర్పాట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ, వేగ నియంత్రణతో మరియు జాగ్రత్తగా వాహనాలు నడపాలని వాహనదారులకు సూచించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, సురక్షిత ప్రయాణం కోసం పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.