తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్ సంయుక్తంగా జిల్లాలో ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన మరియు అమలు (Special Drive) కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా, రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలైన హెల్మెట్ ధరించకపోవడం, అతివేగంగా వాహనాలు నడపడం, రాంగ్ సైడ్ / ఎదురుదారి డ్రైవింగ్ వంటి అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. వాహనదారులకు రోడ్డు నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు.డ్రైవ్ సమయంలో వాహనాల పత్రాలు పరిశీలించి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లపై చట్టప్రకారం జరిమానాలు విధించారు. అలాగే, కేవలం శిక్ష విధించడమే కాకుండా, ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రజలకు సలహాలు, హెచ్చరికలు ఇచ్చారు.అదనంగా, ప్రజలతో మరియు వాహనదారులతో రోడ్డు భద్రతపై ప్రమాణం (ఓటు) చేయించి,
👉 తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం,
👉 వేగ పరిమితులను కచ్చితంగా పాటించడం,
👉 ఎదురుదారి డ్రైవింగ్ చేయకపోవడం,
👉 ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించడంఈ సందర్భంగా ప్రకాశం జిల్లా పోలీసులు మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణ నష్టానికి దారితీస్తుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఇలాంటి అవగాహన మరియు అమలు కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.ప్రజలు ట్రాఫిక్ పోలీసులతో సహకరించి, నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం చేయాలని, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
