తొలి శుభోదయం సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి జనసేన పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పేదల పెన్నిధిగా అన్ని వర్గాలకు నేనున్నానని అండగా నిల్చిన నేత , సంచలన నాయకుడు రంగా గారు. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు రంగా గారి పేరు వ్యాపించింది, ఈరోజుకి రంగా గారి పేరు చెబితే ప్రతి ఒక్కరి హృదయాల్లో ఒక సరికొత్త వైబ్రేషన్ మొదలవుతుంది, కుల మత ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఘనమైన నివాళులర్పిస్తున్నాము అని జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, పొన్నలూరు మండలం నాయకులు పత్తిపాటి మాధవరావు, కాసుల శ్రీను, సీనియర్ జర్నలిస్టు సంగు వసంతయ్య, సంకె నాగరాజు, మహర్షి, అనుమలసెట్టి కిరణ్, జగదీష్, గుంటుపల్లి శ్రీను, రెహముతుల్లా, తగరం రాజు పాల్గొని నివాళులర్పించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *