తొలి శుభోదయం కందుకూరు:-

వసంత పంచమి శుభ సందర్భంగా శ్రీ గాయత్రీ ఒలింపియాడ్ స్కూల్‌లో వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరీ తరగతిలో నూతనంగా చేరిన చిన్నారుల కోసం “అక్షరాభ్యాసం” కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శ్రీ గాయత్రీ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ సిహెచ్ రామకృష్ణ రావు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను ఆశీర్వదించి, వారి విద్యాభ్యాసానికి శుభారంభం కలగాలని ఆకాంక్షించారు. అలాగే శ్రీ గాయత్రీ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సిహెచ్ ఉషా చంద్రిక విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, చిన్ననాటి విద్య ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమానికి నూతనంగా చేరిన చిన్నారులు వారి తల్లిదండ్రులతో కలిసి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చిన్నారుల ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ అక్షరాభ్యాసం కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *