తొలి శుభోదయం ప్రకాశం :-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నలూరు జూనియర్ కాలేజీలో ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినప్పుడు వెంటనే తల్లిదండ్రులు, అధ్యాపకులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను తెలియజేయాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారి రక్షణకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.చిన్నారులు మరియు యువత భద్రతే ప్రకాశం జిల్లా పోలీస్ యొక్క ప్రధాన లక్ష్యమని, విద్యా సంస్థల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *