తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , పామూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారు వెలిగండ్ల పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని సీడీ ఫైళ్లు, కేసు రిజిస్టర్లు, స్టేషన్ రికార్డులు తదితర పత్రాలను సవివరంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచనలు చేశారు.అనంతరం పోలీస్ సిబ్బందితో విధుల నిర్వహణ, ప్రజలకు అందించాల్సిన సేవలపై చర్చించి, శాంతి భద్రతల పరిరక్షణలో మరింత చురుకుగా వ్యవహరించాలని తెలిపారు. అలాగే ప్రజలతో మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బందితో కలిసి భోజనం చేసి, వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, సిబ్బంది ఐక్యతతో పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పామూరు సీఐ పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *