తొలి శుభోదయం కందుకూరు:-

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వలేటివారిపాలెం మండలం వలేటివారిపాలెం గ్రామంలో అధికారులు, నాయకులతో కలిసి ఆయన స్వయంగా చీపురుపట్టి రోడ్లు ఊడ్చారు. జిల్లా పరిషత్ హైస్కూల్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు చుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని, తద్వారా వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని చెప్పారు. భోజనానికి ముందు, వాష్ రూమ్ కు వెళ్లి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఇళ్ల వద్ద తల్లిదండ్రులకు కూడా పరిశుభ్రత గురించి వివరించాలని కోరారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారధ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు వచ్చాయని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. మంచి బట్టలు, నాణ్యమైన భోజనం, ఇతర సౌకర్యాలన్నీ విద్యార్థులకు అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కువసార్లు డీఎస్సీలు నిర్వహించి, పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వల్ల విద్యార్థులు ఎలా చదువుతున్నారు, ప్రవర్తన ఎలా ఉంది అన్న విషయాలను తల్లిదండ్రులు తెలుసుకోగలుగుతున్నారని చెప్పారు. వలేటివారిపాలెం హై స్కూల్ అభివృద్ధికి దాతల సహకారం ఎంతగానో ఉందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. ఒక మాట చెప్పగానే గ్రామస్తులంతా ముందుకు వచ్చి పాఠశాల ఆవరణలో మట్టితోలి చదును చేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. అంతకుముందు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో శంకర్రావు ఎమ్మార్వో నజీర్ అహ్మద్, అగ్రికల్చర్ ఏడి శేషారెడ్డి, మండల వెటర్నరీ అధికారి చెన్నకేశవులు, గ్రామ సర్పంచ్ సాధు శ్రీలత, వలేటివారిపాలెం మండలం పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకుమాని ఆంజనేయులు, గుత్తా మహేశ్వరరావు, వలేటి నరసింహం, వలేటి శ్రీధర్ నాయుడు వలేటి మధు, కొంకా రమేష్, మన్నం మాధవ, కాకుమాని మాల్యాద్రి, గుత్తా తిరుపతయ్య, తిరుపతిస్వామి, షేక్ ఖాజావలి, నవులూరి రాజా రమేష్, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, చెరువుపల్లి మాల్యాద్రి, ప్రగడ శీను కామినేని అశోక్, మోదేపల్లి నారాయణ, మన్నం కృష్ణ, అత్తోట వెంకటేశ్వర్లు, మాధవ, కొండయ్య, మండలంలోని అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *