తొలి శుభోదయం కందుకూరు:-

కార్యాలయ ప్రాంగణంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు ఆధ్వర్యంలో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ రావుల వెంకయ్య సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కే వీరారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జాతీయ జెండాను రావుల వెంకయ్య ఆవిష్కరించే గౌరవ వందనం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ఏర్పడిన భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా గణతంత్ర వేడుకలు ప్రజలందరికీ భారత గణతంత్ర అందించిన ఫలాలు ప్రయోజనాలు భారత సమాజంలోని ప్రజలందరికీ సమానంగా అందాలన్నదే భారత కమ్యూనిస్టు పార్టీ ముఖ్య ఉద్దేశం అని అన్నారు అలాంటి గణతంత్ర స్ఫూర్తిని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం వాద లౌకిక అనే పదాలు తొలగించేందుకు కుట్ర చేస్తుందని భారత సమాజాన్ని మతతత్వ సమాజాన్ని భారతదేశానికి అందించాలని ఆర్ఎస్ఎస్ రహస్య అజెండాను భోజన అమలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి సందర్భంలో గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రజాస్వామ్యవాదులు మేధావులు వామపక్ష పార్టీలు ఐక్యంగా ఓకే నినాదంతో గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజలందరికీ సమానంగా అందించాలని పిలుపు ఇచ్చారు ఇదే సమయంలో భారత సమాజాన్ని ఈడగొట్టి గణతంత్ర స్ఫూర్తిని నాశనం చేస్తూ లౌకిక పదాలను తొలగించాలని చేస్తున్న బిజెపి ప్రభుత్వ కుట్రను ఐక్యంగా తిప్పికొట్టాలని అన్నారు కార్యక్రమంలో వీరారెడ్డి సురేష్ తదితరులు మాట్లాడారు కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆనందమోహన్ ఉప్పుటూరి మాధవరావు లక్ష్మీనారాయణ కోటేశ్వరరావు బాల బ్రహ్మచారి సెయింట్ వర్కర్స్ యూనియన్ నాయకులు రవి బిట్రా శీను నాగరాజు ఆలూరి చంద్ర కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *