తొలి శుభోదయం కందుకూరు :-
గత 100 సంవత్సరాలుగా స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తదుపరి ఈ సమాజంలోని పేద బలహీన పేద కార్మిక కర్షక రైతు కూలీ విద్యార్థి యువజన మహిళ ఉద్యోగుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (cpi) శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి డి సురేష్ బాబు ఒక ప్రకటన ద్వారా పేద వర్గాలకు కార్మికులకు రైతులకు కూలీలకు విద్యార్థి యువజన మహిళలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 26 ఉదయం 10 గంటలకి పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుండి పామూరు రహదారి లో గల తిరుమల ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ జరుగుతుందని అనంతరం సిపిఐ శతాబ్ది ఉత్సవాలు జరుగుతాయని ఈ కార్యక్రమానికి సిపిఐ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు అనుబంధ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పేద వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరైఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు