తొలి శుభోదయం ఒంగోలు:-

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత పురుషులకు సెల్ ఫోన్ రిపేర్ మరియు సర్వీసింగ్ నందు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 19వ తేదీ నుండి ఫిబ్రవరి 18వ తేదీ వరకు 30 రోజులు ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 19 ఏళ్ల నుండి 50 ఏళ్ల లోపు యువకులు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ క్రింది ఫోన్ నెంబర్ ను సంప్రదించవలెను 9573363141

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *