తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-

ప్రజల భద్రత, హక్కుల పరిరక్షణ, నేరాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు జిల్లా వ్యాప్తంగా సైబర్ మోసాలు, నూతన క్రిమినల్ చట్టాలు, రోడ్డు భద్రత, మహిళలకు సంబంధించిన సమస్యలు మరియు శక్తి యాప్ అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.ఈ కార్యక్రమాల్లో భాగంగా పోలీస్ అధికారులు పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఫేక్ కాల్స్, ఫిషింగ్ లింకులు, ఓటీపీ మోసాలు, ఆన్‌లైన్ చీటింగ్, డిజిటల్ చెల్లింపుల మోసాల నుండి ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలను వివరించారు. వ్యక్తిగత, బ్యాంకు సంబంధిత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియజేయకూడదని సూచించారు.అలాగే నూతన క్రిమినల్ చట్టాలపై ప్రజలకు స్పష్టత కల్పిస్తూ, ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు, ప్రజా భద్రతకు సంబంధించిన కేసుల్లో చట్టాలు మరింత కఠినంగా అమలు అవుతున్నాయని వివరించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడమే కాకుండా, నేరాల నివారణలో పోలీస్ శాఖకు సహకరించవచ్చని పేర్కొన్నారు.మహిళల భద్రత మరియు మహిళలకు సంబంధించిన చట్టాలపై ప్రత్యేక దృష్టి సారించి, మహిళలపై జరిగే నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. మహిళలకు చట్టపరమైన హక్కులు, రక్షణ చట్టాలు, పోలీస్ శాఖ అందించే సహాయంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా Shakti App ప్రాధాన్యతను వివరిస్తూ, మహిళలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక బటన్ నొక్కగానే పోలీస్ సహాయం అందే విధానాన్ని వివరించారు.అదేవిధంగా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం మరియు మొబైల్ ఫోన్ వినియోగాన్ని నివారించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు తెలిపారు.ప్రజలతో పోలీసుల మధ్య విశ్వాసం పెంపొందించడమే కాకుండా, నేర రహిత సమాజం నిర్మించడమే ఈ అవగాహన కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ప్రకాశం జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *