తొలి శుభోదయం కందుకూరు:-
పట్టణంలోని కోటారెడ్డి వైద్యశాల సమీపంలో ఏఐటియుసి అనుబంధం స్కందపురి పెయింట్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యాలయాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ శివకుమార్ రెడ్డి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు లు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెయింట్ వర్కర్స్ సమైక్యతతో భవన నిర్మాణానికి పూనుకోవడం సంతోషదాయకమన్నారు. ఏ వృత్తి అయిన వృత్తినిపుణుల మధ్య సహకారం, సమన్వయం ఉన్నప్పుడే రాణిస్తుందని ఆయన తెలిపారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే వీర రెడ్డి మాట్లాడుతూ అనేక కార్మిక సంఘాలకు ఏఐటీయూసీ అనుబంధంగా ఉందని వారి హక్కుల కోసం ఏఐటియుసి నిరంతరం శ్రమిస్తుందని ఆయన అన్నారు. పెయింట్ వర్కర్స్ ఎంతో సమైక్యంగా ఒక్క మాట మీద నిలబడి యూనియన్ ఏర్పాటు చేసి కార్యాలయాన్ని నిర్మించటం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఇదేవిధంగా ఐక్యమత్యంతో అందరూ కలిసి యూనియన్ ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రతి పెయింట్ వర్కర్ కార్మికునికి ఎటువంటి సమస్య వచ్చినా ముందుండి సమస్యకే పోరాడి పరిష్కరించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. ముందుగా ఏఐటియుసి జెండాను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. వీరారెడ్డి ఆవిష్కరించారు ఈకార్యక్రమంలో ఏఐటియుసి కందుకూరు నియోజకవర్గ అధ్యక్షులు కే మురళి, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వై ఆనంద్ మోహన్, సిపిఐ నాయకులు కే.రాము, ఉప్పుటూరి మాధవరావు, స్కందపురి పెయింట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జమ్మలమడుగు.రవి, ప్రధాన కార్యదర్శి కంకణాల చిన్న బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు బిట్రా శ్రీనివాసులు, సహాయ కార్యదర్శిలు దగ్గుమాటి నాగరాజు, బడుగు రోజాబాబు, వైజాగ్ నరసింహం, గెరా నరేష్, మద్దాల.రాముడు, జంగా మాల్యాద్రి, మెండా లెనిన్, తదితరులు పాల్గొన్నారు.
