తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్న ‘స్కై ఐ ప్రకాశం’ (Sky Eye Prakasam) ప్రాజెక్టులో భాగంగా కొండపి సీఐ వినూత్నంగా నిఘా నిర్వహించారు. కొండపి పాఠశాల మైదానం మరియు గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చేవూరు గ్రామంలో డ్రోన్ల ద్వారా మెరుపు తనిఖీలు చేపట్టారు. ఈ అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి పాఠశాల పరిసరాల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆకతాయిలను పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారికి సీఐ ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి, చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే ‘స్కై ఐ’ నిఘా నుండి తప్పించుకోలేరని హెచ్చరించారు. నేరాల నియంత్రణకు, మహిళలు మరియు విద్యార్థుల భద్రతకు ఈ డ్రోన్ ప్రాజెక్టు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని, ఇకపై ప్రతి గ్రామంలోనూ ఈ నిఘా కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *