తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్‌లో భాగంగా మర్రిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాలలో డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా నిర్వహించారు. ఈ డ్రోన్ నిఘాను మర్రిపూడి పి.ఎస్. ఎస్ఐ ఆధ్వర్యంలో చేపట్టారు.గ్రామ శివార్లు, పంట పొలాలు, నిర్జన ప్రాంతాలు, అనుమానాస్పద కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో ఆధునిక డ్రోన్ సాంకేతికతను వినియోగించి పర్యవేక్షణ చేపట్టారు. ఈ నిఘా ద్వారా నేరాల నివారణ, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్ట మరియు ప్రజల భద్రతను పెంపొందించడం లక్ష్యంగా ఉందని పోలీసులు తెలిపారు.ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్‌ను జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా పోలీసులు పేర్కొన్నారు.తమ పరిసర ప్రాంతాల్లో ఏవైనా అనుమానాస్పద లేదా అక్రమ కార్యకలాపాల సమాచారం ఉన్నట్లయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112/100 కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
