తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :-
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు అమలు చేస్తున్న స్కై ఐ ప్రకాశం (Sky Eye Prakasam) ప్రాజెక్ట్‌లో భాగంగా, పొన్నలూరు మండలం ముండుమూరువారిపాలెం గ్రామ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ నిఘా నిర్వహించారు.ఈ డ్రోన్ సర్వేలాన్స్ కార్యక్రమాన్ని పొన్నలూరు ఎస్ఐ పర్యవేక్షిస్తూ, గ్రామ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అనుమానాస్పద కార్యకలాపాలపై గగనతల నిఘా కొనసాగించారు. ఈ చర్య ద్వారా అక్రమ కార్యకలాపాలను ముందుగానే గుర్తించి, శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకునేలా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది.డ్రోన్ నిఘా ద్వారా ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడమే కాకుండా, నేర నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ ద్వారా మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి నిఘా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.