తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో స్థానిక స్మార్ట్ జెన్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మ్రోగించారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరమునకు చెందిన షేక్ అంజు పర్వీన్ 465/470 మార్కులతో సింగరాయకొండ పట్టణ మరియు నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానం మరియు రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం సాధించారు.
మా కళాశాలలో మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన ప్రతి ఇద్దరి విద్యార్థుల్లో ఒకరు 400 పైగా మార్పులు సాధించి సత్తా చాటారు అలాగే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం దామచర్ల హిమప్రియ 986/1000 మరియు సర్వేపల్లి సాయి నేహా శ్రీ 985/1000 మార్కులు సాధించారు.
ఈ విజయానికి కారకులైన విద్యార్థినీ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి స్మార్ట్ జెన్ జూనియర్ కళాశాల కస్పాండెంట్ డాక్టర్ గీతారాణి మరియు చైర్మన్ శ్రీ శ్రీనివాస రావు అభినందనలు తెలియజేశారు.